మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా భారత్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మహ్మద్ హఫీజ్(4)ను ఆశిష్ నెహ్రా పెవిలియన్కు పంపాడు. మొదటి ఓవర్లో ఫోర్ కొట్టి ఊపుమీద కనబడ్డ హఫీజ్.. నెహ్రా వేసిన నాల్గో బంతికి చిక్కాడు.
నెహ్రా కొద్దిగా బౌన్స్ ను జోడించి ఆఫ్ స్టంప్ పై సంధించిన బంతి హఫీజ్ బ్యాట్ను ముద్దాడుతూ మహేంద్ర సింగ్ ధోని చేతుల్లోకి వెళ్లడంతో పాకిస్తాన్ ఆదిలోనే వికెట్ను నష్టపోయింది. దీంతో పాకిస్తాన్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోయి ఐదు పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ తీసుకుంది.