రెండు పరుగులు.. రెండు వికెట్లు
మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో భారత్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ రెండు పరుగులకే రెండు వికెట్లను నష్టపోయింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు డకౌట్ గా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్తాన్ విసిరిన 84 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే కష్టాలను కొనితెచ్చుకుంది. పాకిస్తాన్ మహ్మద్ అమిర్ కు తొలి రెండు వికెట్లు లభించడంతో భారత్ శిబిరంలో ఆందోళన నెలకొంది.