మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇంకా ఇరు జట్లు బోణి కొట్టలేదు. భారత్పై జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలవ్వగా, బంగ్లాదేశ్ , శ్రీలంకలపై యూఏఈ పరాజయం చెందింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే అటు బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న పాకిస్తాన్.. బ్యాటింగ్పై దృష్టి సారించాల్సి ఉంది. భారత్తో జరిగిన మ్యాచ్లో ఏ ఒక్క ఆటగాడు ఆకట్టుకోలేకపోవడం పాకిస్తాన్ జట్టులో కాస్త ఆందోళన నెలకొంది.