ట్వెంటీ20తో క్రికెట్ కు మరింత ఉత్సాహం: సచిన్
ట్వెంటీ20తో క్రికెట్ కు మరింత ఉత్సాహం: సచిన్
Published Sun, Aug 18 2013 2:37 PM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
ఒత్తిడి జయించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేయాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కేఎస్ సీఏ ప్లాటినమ్ జూబ్లీ సెలబ్రేషన్ లో సచిన్ మాట్లాడుతూ జాతీయ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసేట్టప్పుడు వారి దేశవాళీ పోటీలలో సాధించిన స్కోర్ల ఆధారంగా కాకుండా.. అంతర్జాతీయ పోటీల్లో ఒత్తిడిని తట్టుకుని రాణించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్ లో అద్బుతంగా రాణించి..అంతర్జాతీయ క్రికెట్ లో ఘోరంగా విఫలమైన వారిని ఎంతో మందిని తాను చూశానని సచిన్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని జట్టు ఎంపిక చేయాలని మాస్టర్ అన్నాడు. ఒకవేళ ఆటగాడు విఫలమైనా.. కొన్ని అవకాశాలిచ్చి ఆటగాడి సామర్ధ్యాన్ని పరిశీలించాలన్నాడు. ట్వెంటీ20 ఫార్మాట్ క్రికెట్ స్వరూపాన్నే మార్చి వేసిందని.. టెస్ట్ విజయాలపై ప్రభావం కూడా చూపుతోంది అని సచిన్ తెలిపాడు. మూడు ఫార్మాట్లు ఉన్న ఒకే ఒక క్రీడ క్రికెట్ అని.. ట్వంటీ20 క్రికెట్ ఆటను మరింత ఉత్సాహభరితంగా మార్చిందన్నారు.
Advertisement