
కష్టాల్లో టీమిండియా
మూడు టీ 20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
పుణె: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ(0), అజింక్యారహానే(4), శిఖర్ ధావన్(9), సురేష్ రైనా(20), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(2)లు పెవిలియన్ చేరి అభిమానుల్ని నిరాశపరిచారు. శ్రీలంకపై చెలరేగిపోతుందనుకున్న భారత ఆటగాళ్లు సగం ఓవర్లు అవ్వకుండానే సగం వికెట్లను కోల్పోయారు.
తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. ఐదో ఓవర్ చివరి బంతికి మూడో వికెట్ ను నష్టపోయింది. తరువాత తొమ్మిదో ఓవర్ రెండు బంతికి నాల్గో వికెట్, తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి ఐదో వికెట్ ను టీమిండియా నష్టపోయింది. శ్రీలంక బౌలర్లలో కాశున్ రజితా మూడు వికెట్లు సాధించగా, షనాకా రెండు వికెట్ల తీశాడు. టాస్ గెలిచిన లంకేయులు తొలుత టీమిండియాను బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించారు.