
టీమిండియా బ్యాటింగ్
ఆసియాకప్ లో భాగంగా బుధవారం ఇక్కడ భారత్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మిర్పూర్: ఆసియాకప్ లో భాగంగా బుధవారం ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లా టాస్ గెలిచిన అనంతరం భారత్ ను మొదటి బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్ నెస్ నిరూపించుకుని అందుబాటులోకి వచ్చాడు.
ఈ ఏడాది ఆరంభం నుంచీ టి20 ఫార్మాట్‌లో అద్భుతంగా ఆడుతున్న భారత్.. ఇటీవల ట్వంటీ 20 ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆసియాకప్కు సిద్ధమైంది.ఆస్ట్రేలియాలో మూడింటికి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో శ్రీలంకపై సిరీస్ ను కూడా సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత ఏడాది స్వదేశంలో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వన్డే సిరీస్‌లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో బంగ్లా బరిలోకి దిగుతోంది.