
పది ఓవర్లలో బంగ్లా స్కోరు 51/3
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. భారత్ విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ స్కోరు బోర్డు మెల్లగా ముందుకు వెళుతోంది. బంగ్లా ఓపెనర్ మహ్మద్ మిథున్(1) తొలి వికెట్ గా ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో అవుట్ కాగా, సౌమ్య సర్కార్(11)ను బూమ్రాహ్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత ఇమ్రూల్ కేయ్స్(14)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు.