
మూడు పరుగులు.. రెండు వికెట్లు
మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది.
విశాఖ: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రెండు వికెట్లును సాధించాడు.ఓపెనర్లు డిక్ వెల్లా(1), తిలకరత్నే దిల్షాన్(1)లను పెవిలియన్ కు పంపి లంకేయులకు షాకిచ్చాడు. దీంతో శ్రీలంక మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది.
ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచినే జట్టే అటు సిరీస్తో పాటు నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో టీమిండియా ఆ ర్యాంకును తిరిగి చేజిక్కించుకోవాలని యోచిస్తోంది.ఒకవేళ ధోని సేనకు ఓటమి ఎదురైతే ఏడో ర్యాంకు పడిపోకతప్పదు.