ఢిల్లీ నుంచి రాంచీకి మారిన శ్రీలంక మ్యాచ్ | BCCI shifts India-Sri Lanka T20I from Delhi to Ranchi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి రాంచీకి మారిన శ్రీలంక మ్యాచ్

Published Fri, Jan 29 2016 7:47 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

BCCI shifts India-Sri Lanka T20I from Delhi to Ranchi

న్యూఢిల్లీ:వచ్చేనెల 12 వ తేదీన శ్రీలంక-టీమిండియాల మధ్య జరిగే రెండో ట్వంటీ 20 మ్యాచ్ జరిగే వేదిక ఢిల్లీ నుంచి రాంచీకి మారింది. ఆ మ్యాచ్ ను నిర్వహించడానికి తాము ప్రస్తుతం సిద్ధంగా లేనట్లు డీడీసీఏ(ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు తెలియజేయడంతో మ్యాచ్ వేదికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ వేదికను ఢిల్లీ నుంచి రాంచీకి మారుస్తున్నట్లు బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. శ్రీలంక-టీమిండియా మ్యాచ్ నిర్వహణలో భాగంగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు పీఓసీ సర్టిఫికేట్ ను జారీ చేయడానికి రాష్ట్ర హైకోర్టు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వేదిక మార్పు అనివార్యమైంది.

వచ్చే నెల 9 నుంచి 14 వరకు భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ 9న పుణేలో, రెండో మ్యాచ్ 12న  రాంచీలో, చివరి మ్యాచ్ 14న విశాఖలో జరుగుతాయి.  ఈ సిరీస్ లో  చండిమాల్ శ్రీలంకకు సారథ్యం వహిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement