'క్రికెట్ అనేది డ్రామాలా తయారైంది' | Cricket is like soap opera, has to be entertaining, says Stephen Fleming | Sakshi
Sakshi News home page

'క్రికెట్ అనేది డ్రామాలా తయారైంది'

Published Fri, Nov 11 2016 1:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

'క్రికెట్ అనేది డ్రామాలా తయారైంది'

'క్రికెట్ అనేది డ్రామాలా తయారైంది'

క్రిస్ట్చర్చ్:ఇటీవల కాలంలో క్రికెట్ మ్యాచ్లు విపరీతంగా పెరిగిపోవడాన్ని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తీవ్రంగా తప్పుబట్టాడు. క్రికెట్ అనే క్రీడ టెలివిజన్లో నిరంతరం ప్రసారమయ్యే డ్రామా మాదిరిగా తయారైందని విమర్శించాడు. ఈ తరహా పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదని ఫ్లెమింగ్ తెలిపాడు. క్రికెట్ అనేది ఒక వినోదాత్మకమైన క్రీడ, అది అదే స్థాయిలో ఉండాలి కానీ లెక్కకు మించి మ్యాచ్లు జరపడం ఆ గేమ్లో మజాను ఘోరంగా  దెబ్బతీస్తుందన్నాడు.
 

మరొకవైపు టీ 20 లీగ్లు కూడా మరింత పెరగడంపై ఫ్లెమింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో క్రికెటర్లు ఆడటానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు కానీ, తాము ఈ గేమ్ ఆడం అని చెప్పడం లేదన్నాడు. అందుకు కారణం ఇక్కడ డబ్బు వారిపై తీవ్ర ప్రభావం చూపడమేనన్నాడు. ఈ తరహా గేమ్తో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికి దీనికి సరైన పరిష్కారం లేకపోయినా, రాబోవు రోజుల్లో మ్యాచ్ల నిర్వహణ తగ్గితేనే ఆ క్రీడను కాపాడటానికి ఆస్కారం ఉందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement