
టాస్ గెలిచిన టీమిండియా
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న ధోని సేన హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు ఒక మ్యాచ్లో గెలిచి, మరో మ్యాచ్లో ఓటమి పాలైన లంకేయులు తీవ్ర ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమయ్యారు.
అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో శ్రీలంక కంటే మెరుగ్గా ఉన్న టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గత పాకిస్తాన్ మ్యాచ్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య తొమ్మిది ట్వంటీ 20 మ్యాచ్లు జరగ్గా అందులో భారత్ ఐదింట గెలవగా, లంకేయులు నాలుగు మ్యాచ్ల్లో గెలిచారు.