మిర్పూర్: ఆసియాకప్లో భారత్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో శ్రీలంక మరోసారి తడబడింది. శ్రీలంక 105 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయారు. శ్రీలంక ఆటగాళ్లలో కపుగదెరా(30, సిరివర్దనే(22) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు చండిమల్(4), జయసూరియా(3) , దిల్షాన్(18), మాథ్యూస్(18)లు తీవ్రంగా నిరాశపరిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రాలకు తలో వికెట్ లభించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీద ఉన్న ధోని సేన ఈ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది.
శ్రీలంక 105/7
Published Tue, Mar 1 2016 8:28 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement