
పెరీరా హ్యాట్రిక్
భారత్ తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
రాంచీ: భారత్ తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హ్యాట్రిక్ సాధించి టీ 20ల్లో ఆ ఘనతసు సాధించిన తొలి లంక క్రికెటర్ గా నిలిచాడు. 19.0 ఓవర్ ను వేసిన పెరీరా హ్యాట్రిక్ తో శభాష్ అనిపించాడు. తొలుత కొన్ని బంతులను వైడ్లుగా వేసినా ఆ తరువాత కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో భారత ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా, ఆ తరువాత రైనా, యువరాజ్ లను పెవిలియన్ కు పంపాడు.
ఆ ఓవర్ లో ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడంతో టీమిండియా స్కోరు కాస్త తగ్గింది. దీంతో ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ,జాకబ్ ఓరమ్, సౌతీలు హ్యాట్రిక్ లు సాధించిన వారిలో ఉన్నారు.