
శ్రీలంక మరోసారి ఫీల్డింగ్
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ 20 లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
రాంచీ: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ 20 లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ 20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న లంకేయులు.. మరోసారి టాస్ గెలిచారు. శ్రీలంక టాస్ గెలవడంతో టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. గత మ్యాచ్ లో శ్రీలంకపై ఓటమి పాలైన ధోని సేన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు లంకేయులు మొదటి మ్యాచ్ ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో పోరుకు సన్నద్దమయ్యారు. ఇదే జోరులో మళ్లీ భారత్ ను కంగు తినిపించాలని వారు పట్టుదలగా ఉన్నారు.
గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన సీనియర్ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ రెండో టి20కి అందుబాటులోకి రావడం లంకేయుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరోవైపు టీమిండియా జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి మ్యాచ్ లో ఆడిన జట్టునే యథావిధిగా కొనసాగిస్తున్నారు.