ఇప్పుడు ట్వంటీ20 మ్యాచ్ లు సరికాదు!
కరాచీ: మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)వైఖరిపై మండిపడ్డాడు. వచ్చే సంవత్సరం ఆరంభం కానున్న వరల్డ్ కప్ కు ముందు ట్వంటీ 20 మ్యాచ్ లు నిర్వహించడానికి క్రికెట్ బోర్డు మగ్గుచూపడాన్ని యూసఫ్ తప్పుబట్టాడు. ఈ తరుణంలో ట్వంటీ 20లు నిర్వహించడం ఏమాత్రం సరికాదన్నాడు.' నాకైతే పీసీబీ లాజిక్ ఏమిటో అర్ధం కావడం లేదు. వరల్డ్ కప్ కు ముందు రెండు, మూడు ట్వంటీ 20లు ఆస్ట్రేలియా, కివీస్ తో పాకిస్తాన్ ఆడనుంది. పొట్టి ఫార్మెట్ కు ఇప్పుడు పెద్దపీట వేయడం ఎంతమాత్రం సరికాదు. ఈ తరుణంలో వన్డేలు ఆడించడమే మంచిది' అని యూసఫ్ స్పష్టం చేశాడు. ప్రధానంగా పాకిస్తాన్ కు బ్యాటింగ్ పరంగా ఇబ్బందికర పరిస్థితి ఉన్నందున పరిమిత ఓవర్లో క్రికెట్ ఆడించటమే మంచిదన్నాడు.
సెప్టెంబర్ 17 నుంచి 28 వరకూ కరాచీలో జరిగే ట్వంటీ 20 మ్యాచ్ లు తరువాత పాకిస్తాన్ యూఏఈ బయల్దేరనుంది. అక్కడ ఆస్ట్రేలియా, కివీస్ లతో ఎనిమిది వన్డే మ్యాచ్ లు కూడా ఆడనుంది..