Muhammad Yousuf
-
పాకిస్తాన్ క్రికెట్ ఇక ముగిసినట్లే!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను ఆ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ హెచ్చరించాడు. స్వదేశంలో నిర్వహించనున్న సిరీస్లను ఇకపై యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించడం ఆపేయాలని సూచించాడు. అలా కానీ పక్షంలో పాకిస్తాన్ క్రికెట్ శకం ఇక ముగిసినట్లే అని తీవ్ర వ్యాఖ్యలుచేశాడు. గత ఆరేళ్లుగా నిర్జీవంగా ఉండే దుబాయ్, షార్జా, అబుదాబీ పిచ్ లపై ఆడటం వల్ల పాక్ బ్యాట్స్ మన్ చాలా కోల్పోతున్నారని వ్యాఖ్యానించాడు. అందుకే ఆటగాళ్లు టెక్నిక్, తమ నైపుణ్యం లోపించిందన్నాడు. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన పాక్, రెండో టెస్టుకొచ్చేసరికి మళ్లీ పాతకథే పునరావృతం అయిందన్న నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ యూసఫ్ ఈ విధంగా స్పందించాడు. 2014-15లో ఆసీస్ తో సిరీస్లో పాక్ బ్యాట్స్ మన్ 9 సెంచరీలు కొట్టగా, ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో రెండు టెస్టుల్లో కలిపి ఒక్క సెంచరీ నమోదైందని వెటరన్ ప్లేయర్ యుసఫ్ పేర్కొన్నాడు. పాక్ లో నిర్వహించాల్సిన సిరీస్ లకు శ్రీలంక, బంగ్లాదేశ్ పిచ్ లను ప్రత్యాయ్నాయంగా భావించాలన్నాడు. ఆలా చేయకపోతే టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఎదుర్కొంటున్న పరిస్థితులు తలెత్తుతాయని పీసీబీకి తన అభిప్రాయాలను వివరించాడు. -
వకార్ బహిరంగ క్షమాపణ; సీనియర్ల ఫైర్
కరాచీ: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయానికి బాధ్యత వహిస్తూ కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పడంపై మాజీ కెప్టెన్లు భిన్నంగా స్పందించారు. క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్ లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు. బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్ ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు. జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ ను భారత జూనియర్ టీమ్ కు కోచ్ గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్ కు వకార్ ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. -
ఇప్పుడు ట్వంటీ20 మ్యాచ్ లు సరికాదు!
కరాచీ: మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)వైఖరిపై మండిపడ్డాడు. వచ్చే సంవత్సరం ఆరంభం కానున్న వరల్డ్ కప్ కు ముందు ట్వంటీ 20 మ్యాచ్ లు నిర్వహించడానికి క్రికెట్ బోర్డు మగ్గుచూపడాన్ని యూసఫ్ తప్పుబట్టాడు. ఈ తరుణంలో ట్వంటీ 20లు నిర్వహించడం ఏమాత్రం సరికాదన్నాడు.' నాకైతే పీసీబీ లాజిక్ ఏమిటో అర్ధం కావడం లేదు. వరల్డ్ కప్ కు ముందు రెండు, మూడు ట్వంటీ 20లు ఆస్ట్రేలియా, కివీస్ తో పాకిస్తాన్ ఆడనుంది. పొట్టి ఫార్మెట్ కు ఇప్పుడు పెద్దపీట వేయడం ఎంతమాత్రం సరికాదు. ఈ తరుణంలో వన్డేలు ఆడించడమే మంచిది' అని యూసఫ్ స్పష్టం చేశాడు. ప్రధానంగా పాకిస్తాన్ కు బ్యాటింగ్ పరంగా ఇబ్బందికర పరిస్థితి ఉన్నందున పరిమిత ఓవర్లో క్రికెట్ ఆడించటమే మంచిదన్నాడు. సెప్టెంబర్ 17 నుంచి 28 వరకూ కరాచీలో జరిగే ట్వంటీ 20 మ్యాచ్ లు తరువాత పాకిస్తాన్ యూఏఈ బయల్దేరనుంది. అక్కడ ఆస్ట్రేలియా, కివీస్ లతో ఎనిమిది వన్డే మ్యాచ్ లు కూడా ఆడనుంది..