
శ్రీలంక వికెట్లు టపటపా..
మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో శ్రీలంక టపటపా ఐదు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది.
విశాఖ: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో శ్రీలంక టపటపా ఐదు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. శ్రీలంక ఆటగాళ్లలో డిక్ వెల్(1), దిల్షాన్(1), చండిమాల్(8), గుణరత్నే(4), సిరివర్ధనే(4) వెనువెంటనే వికెట్లను కోల్పోయారు. దీంతో శ్రీలంక 5.1 ఓవర్లలో 21 పరుగులకే ఐదు వికెట్లును నష్టపోయి ఎదురీదుతోంది. తొలి ఓవర్ లోనే అశ్విన్ రెండు వికెట్లు తీసి లంకేయులు షాకిచ్చాడు. దీంతో తీవ్ర ఒత్తిడిలో పడిన శ్రీలంక సగం ఓవర్లు అవ్వకుండానే సగం వికెట్లను నష్టపోయింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, నెహ్రా ఒక వికెట్ తీశాడు.
ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచినే జట్టే అటు సిరీస్తో పాటు నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో టీమిండియా ఆ ర్యాంకును తిరిగి చేజిక్కించుకోవాలని యోచిస్తోంది.