
శరణ్ విజృంభణ: జింబాబ్వే విలవిల
మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ సోమవారం భారత్ తో జరుగుతున్న రెండో మ్యాచ్లో జింబాబ్వే విలవిల్లాడుతోంది.
హరారే: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ సోమవారం భారత్ తో జరుగుతున్న రెండో మ్యాచ్లో జింబాబ్వే విలవిల్లాడుతోంది. భారత బౌలర్ బరిందర్ శరణ్ దెబ్బకు జింబాబ్వే 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జింబాబ్వే కోల్పోయిన నాలుగు టాపార్డర్ వికెట్లుశరణ్ ఖాతాలోనే చేరడం విశేషం.
గత మ్యాచ్కు దూరమైన శరణ్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో దుమ్మురేపుతున్నాడు. ప్రత్యేకంగా ఐదో ఓవర్ లో మూడు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డివిరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జింబాబ్వే ఐదు ఓవర్లు ముగిసే సరికి చిబాబా(10), మసకద్జా(10), సికిందర్ రాజా(1), ముతోంబోడ్జి (0)ల వికెట్లను నష్టపోయింది.