'టీ 20ల్లో టీమిండియానే బెస్ట్' | Sachin Tendulkar Says India Have Best Twenty20 Side in The World | Sakshi
Sakshi News home page

'టీ 20ల్లో టీమిండియానే బెస్ట్'

Published Mon, Feb 8 2016 5:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

'టీ 20ల్లో  టీమిండియానే బెస్ట్'

'టీ 20ల్లో టీమిండియానే బెస్ట్'

ప్రస్తుత ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో టీమిండియానే అత్యుత్తమ జట్టని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు.

ముంబై:  ప్రస్తుత ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో టీమిండియానే అత్యుత్తమ జట్టని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా జట్టు సమతుల్యంగా ముందుకు సాగుతూ ఘన విజయాలను సాధిస్తుందన్నాడు. దీంతో త్వరలో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్లో టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

 

'నా దృష్టిలో టీమిండియా టీ20 జట్టు బలంగా ఉంది. జట్టులో సమతుల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇది టీమిండియా వరల్డ్ కప్ సాధించడానికి లాభిస్తుంది. ఆస్ట్రేలియాలో ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేయడం కూడా జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకవైపు కొత్త కుర్రాడు బూమ్రా ఆకట్టుకున్న విధానం. ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్, హర్భజన్ ల పునరాగమనంతో టీమిండియా సమతుల్యంగా ఉంది' అని సచిన్ తెలిపాడు. ఇటీవల కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలను సాధిస్తూ దూసుకుపోతుందన్నాడు.ప్రత్యేకంగా టీ 20ల్లో భారత్ ఘనవిజయాలను నమోదు చేస్తుందన్నాడు. ఆసీస్ తో ఆడిన చివరి టీ 20 మ్యాచ్ ను తాను ఆఖరి బంతి వరకూ చూశానని సచిన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement