బ్రిస్బేన్: టీమిండియాతో మూడు టీ20ల సిరీస్ తర్వాత ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు ఆసీస్ జట్టును ప్రకటించింది. టిమ్ పైన్ నేతృత్వంలోని 14 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెల్లడించింది. ఆసీస్ ప్రకటించిన జట్టులో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ మార్కస్ హారిస్‌కు చోటు దక్కింది. మరొకవైపు ఇప్పటివరకూ నాలుగు అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడిన క్రిస్ ట్రిమైన్‌కు సైతం టెస్టు జట్టులో స్థానం లభించింది. ఇటీవల పాకిస్తాన్‌తో యూఏఈ వేదికగా జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన పరిమిత ఓవర్ల స్పెషలిస్టు అరోన్ ఫించ్‌కు మరోసారి అవకాశం దక్కింది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఇదే..
టిమ్ పైన్(కెప్టెన్), మార్కస్ హారిస్, అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, హ్యాండ్ స్కాంబ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, హజల్‌వుడ్, నాథన్ లయన్, పీటర్ సిడెల్, క్రిస్ ట్రిమైన్
Comments
Please login to add a commentAdd a comment