సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1తో గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఆసీస్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. డీకాక్(107) సెంచరీ సాధించాడు. రాసౌన్(51), బెహర్దీన్(63) అర్థ సెంచరీలు చేశారు.
ఆసీస్ కు డీఎల్ఎఫ్ ద్వారా 48 ఓవర్లలో 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆస్ట్రేలియా 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డీకాక్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఆస్ట్రేలియా యువ ఆటగాడు స్టీవెట్ స్మిత్ కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కింది.
ఐదో వన్డేలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు
Published Sun, Nov 23 2014 5:47 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement