
అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో అరంగేట్రం చేసిన టీమిండియా యువ బౌలర్ బూమ్రాహ్ అదరగొడుతున్నాడు. తొలి స్పెల్ లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేసిన బూమ్రాహ్ 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(28) వికెట్ ను తొలి వికెట్ గా బూమ్రాహ్ తన ఖాతాలో వేసుకుని టీమిండియాకు చక్కటి ఆరంభాన్నివ్వడంలో సహకరించాడు. ఇషాంత్ శర్మ, రిషి ధవన్ లకు దీటుగా బూమ్రాహ్ బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ కు ఒకింత కష్టంగా మారింది. ఇషాంత్, రిషి, గుర్ కీరత్ లు పరుగులు సమర్పించుకుంటున్నా.. బూమ్రాహ్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.
టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇప్పటికే నాలుగు వన్డేలను కోల్పోయిన టీమిండియా ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ మాత్రం తమ వరుస విజయాలను సంఖ్యను మరింత పెంచుకోవాలని యోచిస్తోంది.