fifth oneday
-
ధనంజయ మాయాజాలం
కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో శ్రీలంక 178 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఆతిథ్య స్పిన్నర్ అఖిల ధనంజయ (6/29) సఫారీని తిప్పేశాడు. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (97 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో ఓపెనర్ డిక్వెలా (65 బంతుల్లో 43; 5 ఫోర్లు), మెండిస్ (38), డిసిల్వా (30) మెరుగ్గా ఆడారు. సఫారీ బౌలర్లలో మల్డర్, ఫెలుక్వాయో చెరో 2 వికెట్లు పడగొట్టారు. రబడ, డాలా, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ధనంజయ ఆఫ్‌స్పిన్ సుడిలో చిక్కుకుంది. సగం ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. 24.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ డికాక్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. లహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. ధనంజయ తన కెరీర్లో రెండోసారి ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్లను చేజిక్కించుకున్నాడు. అజంత మెండిస్ (శ్రీలంక), షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) తర్వాత వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మూడో భారీ పరాభవాన్ని చవిచూసింది. అయితే ఐదు వన్డేల సిరీస్‌ను ఇదివరకే నెగ్గిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను 3–2తో ముగించింది. -
ఆఖరి పోరులో అదరగొట్టిన టీమిండియా
-
ఆఖరి పోరులో అదరగొట్టిన టీమిండియా
సిడ్నీ: ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. అంతకుముందు మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు చేసినా గెలవని టీమిండియా.. చివరిదైన ఐదో వన్డేలో మాత్రం సమష్టిగా పోరాడి విజయం సాధించింది. శనివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో గెలిచి పరువు దక్కించుకుంది. ఆసీస్ విసిరిన 331 పరుగుల లక్ష్యాన్ని చూసి ఏమాత్రం భయపడిన టీమిండియా టోర్నీలో తొలి విజయాన్ని రుచి చూసింది. టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ(99; 108 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే(104 నాటౌట్;81 బంతుల్లో 8 ఫోర్లు,1 సిక్స్) లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత శిఖర్ దాటిగా ఆడగా, రోహిత్ మాత్రం కుదురుగా బ్యాటింగ్ చేశాడు. అయితే హేస్టింగ్ బౌలింగ్ లో శిఖర్ మిడాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టి అవుటయ్యాడు. శిఖర్ క్యాచ్ ను . గాల్లో డైవ్ కొట్టిన షాన్ మార్ష్ అధ్భుతంగా అందుకోవడంతో టీమిండియా 123 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి(8) ఆఫ్ సైడ్ వెళుతున్న బంతిని ఆడబోయి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కేవలం 11 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తరుణంలో రోహిత్-మనీష్ పాండేల జోడీ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదలించింది. జట్టు స్కోరు 231 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్ కు చేరినా, ఆ తరువాత పాండే -కెప్టెన్ మహేందర సింగ్ ధోనితో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. కాగా, చివరి ఓవర్ లో తొలి బంతిని సిక్స్ కొట్టిన ధోని(34) ఆ తరువాత బంతికి మరో షాట్ కొట్టబోయి అవుటయ్యాడు. ఆ సమయానికి టీమిండియాకు నాలుగు బంతుల్లో ఆరు పరుగులు అవసరం. అప్పుడు స్ట్రైకింగ్ ఎండ్ లోకి వచ్చిన పాండే ఎటువంటి తడబాటు లేకుండా ఆడటంతో టీమిండియా ఇంకా రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. టీమిండియా విజయంలో ముఖ్య భూమిక పోషించిన మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఆకట్టుకున్న బూమ్రాహ్ ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలో సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన బూమ్రాహ్ ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన బూమ్రాహ్ రెండు వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. టీమిండియా బౌలింగ్ ను ఆసీస్ ఊచకోత కోసిన చోట బూమ్రాహ్ పొదుపు బౌలింగ్ చేయడం విశేషం. తొలి స్పెల్ లో ఐదు ఓవర్లలో 17 పరుగులిచ్చి స్మిత్ వికెట్ ను తొలి వికెట్ గా తన ఖాతాలో వేసుకున్న బూమ్రాహ్.. తన చివరి ఓవర్ ల్ ఫాల్కనర్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ 10 ఓవర్లు బౌలింగ్ వేసి 60 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 8 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, రిషి ధవన్ 10 ఓవర్లలో 74 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లలో జడేజా 10 ఓవర్లలో 46 పరుగులివ్వగా, గుర్ కీరత్ సింగ్ రెండు ఓవర్లలో 17పరుగులిచ్చాడు. -
రోహిత్ శర్మ 'బ్యాడ్‌లక్'
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రోహిత్(99; 108 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్) తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ ను హేస్టింగ్ చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. శిఖర్ ధావన్(78) కలిసి తొలి వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్.. మనీష్ పాండేతో కలిసి మూడో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. -
దీటుగా బదులిస్తున్న టీమిండియా
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో 331 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా దీటుగా బదులిస్తోంది. టీమిండియా 30.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. తొలుత శిఖర్ ధావన్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, రోహిత్ శర్మ(75 నాటౌట్) కుదురుగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు శుభారంభాన్నిఅందించింది. అనంతరం శిఖర్, విరాట్ 8) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. రోహిత్ కు జతగా, మనీష్ పాండే(30 నాటౌట్) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపి భారీ స్కోరులో సహకరించారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడీ ప్రత్యేకంగా ఐదో వికెట్ కు 118 పరుగులు నమోదు చేసి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చింది. అనంతరం మిచెల్ మార్ష్ -వేడ్ ల జోడి ఆరో వికెట్ కు మరో 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆసీస్ మూడొందలకు పైగా స్కోరును చేయగల్గింది. -
స్వల్ప వ్యవధిలో కోహ్లి, ధావన్ అవుట్
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా స్వల్ప వ్యవధిలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిల వికెట్లను కోల్పోయింది. తొలుత శిఖర్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత కోహ్లి(8) అనవసరపు షాట్ కోసం యత్నించి రెండో వికెట్ గా అవుటయ్యాడు. 123 పరుగుల వద్ద శిఖర్ వికెట్ ను నష్టపోయిన టీమిండియా.. మరో 11 పరుగుల వ్యవధిలో కోహ్లి వికెట్ ను కోల్పోయింది. ఆసీస్ విసిరిన 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రోహిత్, శిఖర్ లు శుభారంభాన్ని అందించారు. శిఖర్ ధావన్ ఉన్నంతసేపు ఆసీస్ ను పరుగులు పెట్టించాడు. కాగా, శిఖర్ మంచి టచ్ లో ఉన్న సమయంలో హేస్టింగ్ బౌలింగ్ మిడాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టి షాన్ మార్ష్ చేతికి చిక్కాడు. కష్టసాధ్యమైన ఆ క్యాచ్ ను షాన్ అద్భుతంగా ఒడిసి పట్టుకోవడంతో శిఖర్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆ తరువాత క్రీజ్ లో వచ్చిన విరాట్ వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. అయితే హేస్టింగ్ ఆఫ్ సైడ్ వేసిన బంతి విరాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో టీమిండియా 22.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 139 పరుగుల చేసింది. రోహిత్ శర్మ(50), మనీష్ పాండే(0) క్రీజ్ లో ఉన్నారు. -
శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీ
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా 13.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఆసీస్ విసిరిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ ను శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు ఆరంభించారు. శిఖర్(56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ (32 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 330 పరుగులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు సెంచరీలతో రాణించడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు చేసింది. వరుసగా నాలుగు వన్డేల్లో ఓటమి పాలైన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. -
బ్యాటింగ్ కు దిగిన భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, శిఖర ధవన్లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 330 పరుగులను నమోదు చేసింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు సెంచరీలతో రాణించడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు చేసింది. వరుస నాలుగు వన్డేల్లో ఓటమితో ఢీలా పడిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టింది. -
టీమిండియాకు భారీ లక్ష్యం
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 331 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్దేశించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ల జోడి టీమిండియా బౌలింగ్ కు చుక్కలు చూపించడంతో ఆసీస్ మరోసారి మూడొందల పైచిలుకు పరుగులను నమోదు చేసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడీ ప్రత్యేకంగా ఐదో వికెట్ కు 118 పరుగులు నమోదు చేసి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చింది. వార్నర్ అవుటైన తరువాత మిచెల్ మార్ష్ మరింత ప్రమాదకరంగా మారాడు. చివర వరకూ అజేయంగా క్రీజ్ లో ఉన్న మిచెల్ మార్ష్ వన్డేలో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, బూమ్రాహ్ లకు తలో రెండు వికెట్లు లభించగా, రిషి ధవన్ , ఉమేష్ యాదవ్ లకు చెరో వికెట్ దక్కింది. ఆకట్టుకున్న బూమ్రాహ్ ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలో సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన బూమ్రాహ్ ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన బూమ్రాహ్ రెండు వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. టీమిండియా బౌలింగ్ ను ఆసీస్ ఊచకోత కోసిన చోట బూమ్రాహ్ పొదుపు బౌలింగ్ చేయడం విశేషం. తొలి స్పెల్ లో ఐదు ఓవర్లలో 17 పరుగులిచ్చి స్మిత్ వికెట్ ను తొలి వికెట్ గా తన ఖాతాలో వేసుకున్న బూమ్రాహ్.. తన చివరి ఓవర్ ల్ ఫాల్కనర్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ 10 ఓవర్లు బౌలింగ్ వేసి 60 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 8 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, రిషి ధవన్ 10 ఓవర్లలో 74 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లలో జడేజా 10 ఓవర్లలో 46 పరుగులివ్వగా, గుర్ కీరత్ సింగ్ రెండు ఓవర్లలో 17పరుగులిచ్చాడు. -
భారీ స్కోరు దిశగా ఆసీస్
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(122;113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆసీస్ 40.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. క్రీజ్ లో మిచెల్ మార్ష్(63), వేడ్(1)లు ఉన్నారు. అంతకుముందు ఆరోన్ ఫించ్(6), కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6), షాన్ మార్ష్(7) లు పెవిలియన్ చేరారు. తొలుత టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడ్డా..వార్నర్-మిచెల్ మార్ష్ జోడి ఐదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు సహకరించింది. -
దుమ్మురేపుతున్న వార్నర్
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దుమ్మురేపుతున్నాడు. వార్నర్ 100 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ ఆటగాళ్లు ఆరోన్ ఫించ్(6), కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6), షాన్ మార్ష్(7) పెవిలియన్ కు చేరినా.. వార్నర్ మాత్రం టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ శతకం సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్(46 బ్యాటింగ్) క్రీజ్ లో ఉండటంతో ఆసీస్ 35.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 208 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రిషి ధవన్, బూమ్రాహ్ లకు తలో వికెట్ దక్కింది. తొలుత టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఆరోన్ ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టింది. -
అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో అరంగేట్రం చేసిన టీమిండియా యువ బౌలర్ బూమ్రాహ్ అదరగొడుతున్నాడు. తొలి స్పెల్ లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేసిన బూమ్రాహ్ 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(28) వికెట్ ను తొలి వికెట్ గా బూమ్రాహ్ తన ఖాతాలో వేసుకుని టీమిండియాకు చక్కటి ఆరంభాన్నివ్వడంలో సహకరించాడు. ఇషాంత్ శర్మ, రిషి ధవన్ లకు దీటుగా బూమ్రాహ్ బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ కు ఒకింత కష్టంగా మారింది. ఇషాంత్, రిషి, గుర్ కీరత్ లు పరుగులు సమర్పించుకుంటున్నా.. బూమ్రాహ్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇప్పటికే నాలుగు వన్డేలను కోల్పోయిన టీమిండియా ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ మాత్రం తమ వరుస విజయాలను సంఖ్యను మరింత పెంచుకోవాలని యోచిస్తోంది.