
బ్యాటింగ్ కు దిగిన భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, శిఖర ధవన్లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 330 పరుగులను నమోదు చేసింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు సెంచరీలతో రాణించడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు చేసింది.
వరుస నాలుగు వన్డేల్లో ఓటమితో ఢీలా పడిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టింది.