
శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీ
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా 13.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఆసీస్ విసిరిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ ను శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు ఆరంభించారు. శిఖర్(56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ (32 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 330 పరుగులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు సెంచరీలతో రాణించడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు చేసింది. వరుసగా నాలుగు వన్డేల్లో ఓటమి పాలైన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.