
దుమ్మురేపుతున్న వార్నర్
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దుమ్మురేపుతున్నాడు. వార్నర్ 100 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ ఆటగాళ్లు ఆరోన్ ఫించ్(6), కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6), షాన్ మార్ష్(7) పెవిలియన్ కు చేరినా.. వార్నర్ మాత్రం టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ శతకం సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్(46 బ్యాటింగ్) క్రీజ్ లో ఉండటంతో ఆసీస్ 35.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 208 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రిషి ధవన్, బూమ్రాహ్ లకు తలో వికెట్ దక్కింది.
తొలుత టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఆరోన్ ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టింది.