
భారీ స్కోరు దిశగా ఆసీస్
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(122;113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆసీస్ 40.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. క్రీజ్ లో మిచెల్ మార్ష్(63), వేడ్(1)లు ఉన్నారు.
అంతకుముందు ఆరోన్ ఫించ్(6), కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6), షాన్ మార్ష్(7) లు పెవిలియన్ చేరారు. తొలుత టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడ్డా..వార్నర్-మిచెల్ మార్ష్ జోడి ఐదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు సహకరించింది.