కష్టాల్లో ఆసీస్
అడిలైడ్: టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 లో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. టీమిండియా విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 14.0 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆసీస్ 47 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(17) ను తొలి వికెట్ రూపంలో కోల్పోగా, అనంతరం స్టీవ్ స్మిత్(21), ఆరోన్ ఫించ్(44)లను నష్టపోయింది.
స్మిత్, ఫించ్ లు 89 పరుగుల వద్ద నిష్కమించడంతో ఆసీస్ ఒక్కసారిగా చిక్కుల్లో పడింది. ఆపై ట్రావిస్ హెడ్(2), షేన్ వాట్సన్(12)లు అవుటయ్యారు. భారత బౌలర్లలో జడేజా , అశ్విన్ లకు చెరో రెండు వికెట్లు దక్కగా, బూమ్రాకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(90 నాటౌట్), సురేష్ రైనా(41) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ(31), ధోని(11 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.