ఆసీస్ భారీ విజయం | Australia is a huge success | Sakshi
Sakshi News home page

ఆసీస్ భారీ విజయం

Published Mon, Nov 9 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

ఆసీస్ భారీ విజయం

ఆసీస్ భారీ విజయం

కివీస్‌తో తొలి టెస్టు
 
బ్రిస్బేన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 208 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 504 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు సోమవారం 88.3 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్రెండన్ మెకల్లమ్ (80 బంతుల్లో 80; 10 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. స్పిన్నర్ లియోన్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, హేజెల్‌వుడ్, మార్ష్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

మూడు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పెర్త్‌లో 13 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు 1988 అనంతరం గాబా మైదానంలో ఆసీస్ 20 టెస్టులు ఆడగా ఒక్క ఓటమి లేకుండా తన రికార్డును కొనసాగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement