
శ్రీలంక 281 ఆలౌట్
గాలె (శ్రీలంక ) : ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 281 పరుగులకు ఆలౌటైంది. కుషాల్ మెండిస్ (137 బంతుల్లో 86; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యుస్ (65 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 5, లియోన్ 2 పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆటముగిసే సమయానికి 13.3 ఓవర్లలో 2 వికె ట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.