బ్రిస్బేన్: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌటైన పాకిస్తాన్.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినా ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ అజామ్(104: 173 బంతుల్లో 13 ఫోర్లు) సెంచరీ సాధించగా, మహ్మద్ రిజ్వాన్(95; 145 బంతుల్లో 10 ఫోర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఇక ఓపెనర్ షాన్ మసూద్(42), యాసిర్ షా(42)లు ఆకట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 335 పరుగులకే పరిమితమైంది. దాంతో ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.
ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు సాధించగా, హజిల్‌వుడ్ ఆరు వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్‌కు ఐదు వికెట్లు లభించాయి. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్(154), లబూషేన్(185)లు భారీ సెంచరీలతో రాణించగా, మాథ్యూ వేడ్(60) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment