20 ఏళ్లలో ఒక్క టెస్టు కూడా గెలవలేదు..! | Lyon Sets Up Innings Win For Australia Against Pakistan | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో ఒక్క టెస్టు కూడా గెలవలేదు..!

Published Mon, Dec 2 2019 3:16 PM | Last Updated on Mon, Dec 2 2019 5:21 PM

Lyon Sets Up Innings Win For Australia Against Pakistan - Sakshi

అడిలైడ్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కథ మారలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో భాగంగా పాక్‌కు కూల్చేసిన ఆసీస్‌ మరో ఇన్నింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్‌.. ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలి టెస్టులో సైతం ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అసాద్‌ షఫీక్‌(57), మహ్మద్‌ రిజ్వాన్‌(45)లు, షాన్‌ మసూద్‌(68)లు మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. దాంతో పాక్‌కు ఇన్నింగ్స్‌ పరాభవం తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయన్‌ ఐదు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా హజల్‌వుడ్‌ మూడు వికెట్లు సాధించగా, మిచెల్‌ స్టార్క్‌కు వికెట్‌ దక్కింది. 39/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఫాలోఆన్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌ను ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు మసూద్‌-షఫీక్‌లు ఆదుకునే యత్నం చేశారు. కాగా, వీరిద్దరూ ఔటైన తర్వాత పాకిస్తాన్‌ పతనం కొనసాగింది.  రిజ్వాన్‌ కాసేపు ప్రతిఘటించడం మినహా మిగతావారు ఆసీస్‌ బౌలింగ్‌కు దాసోహం అయ్యారు.

20 ఏళ్లలో ఐదోసారి..
ఆస్ట్రేలియా పర్యటనలో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌ను పాక్‌  గెలవకపోవడం గత 20 ఏళ్లలో ఐదోసారి. 1999 నుంచి చూస్తే ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌ ఒక్క టెస్టు మ్యాచ్‌ను గెలవలేదు. 1999లో ఆసీస్‌ 3-0తో సిరీస్‌ను గెలవగా, 2004, 2009, 2016ల్లో సైతం ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా ఆసీస్‌ 2-0తో గెలుచుకుంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోవడం రెండోసారి మాత్రమే. 1972లో తొలిసారి ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయిన పాక్‌.. తాజాగా దాన్ని రిపీట్‌ చేసింది.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 589/3 డిక్లేర్డ్‌

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 302 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 239 ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement