తొలి టెస్టులో ఆసీస్ గెలుపు | Australia won the first Test | Sakshi
Sakshi News home page

తొలి టెస్టులో ఆసీస్ గెలుపు

Published Sun, Jun 7 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

తొలి టెస్టులో ఆసీస్ గెలుపు

తొలి టెస్టులో ఆసీస్ గెలుపు

9 వికెట్లతో విండీస్ చిత్తు
స్టార్క్‌కు 4 వికెట్లు

 
 రోసీయూ : ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... వెస్టిండీస్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కరీబియన్ జట్టు నిర్దేశించిన 47 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడోరోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. వార్నర్ (28) అవుటైనా... మార్ష్ (13 నాటౌట్), స్మిత్ (5 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. టేలర్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 25/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది.

మార్లన్ శామ్యూల్స్ (184 బంతుల్లో 74; 7 ఫోర్లు, 1 సిక్స్), డోవ్రిచ్ (185 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. ఓ దశలో 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ చివరి 7 వికెట్లు 35 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. స్టార్క్ 4, జాన్సన్, హాజెల్‌వుడ్, లియోన్ తలా రెండు వికెట్లు తీశారు. వోజెస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు కింగ్‌స్టన్‌లో ఈనెల 11 నుంచి జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement