సిడ‍్నీ: గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ సాకర్ తన పదవికి రాజీనామా చేశాడు. దాదాపు మూడు సీజన్ల నుంచి ఆసీస్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించిన సాకర్.. జట్టును వీడే సమయం ఇదేనని భావించి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. ‘నేను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సేవలందించే క్రమంలో చాలా ఎంజాయ్ చేశా. మేటి బౌలర్లు ఉన్న జట్టుతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సాకర్ తెలిపాడు.
ఇక ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. తొమ్మిది నెలల నుంచి డేవిడ్ సాకర్‌తో కలిసి పని చేస్తున్నా. డేవిడ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జట్టులో చెరగని ముద్ర వేసిన సాకర్‌కు ధన్యవాదాలు. ఆసీస్ పేస్ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేయడంలో సాకర్ పాత్ర వెలకట్టలేదని. ఆసీస్ జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ అతని సుదీర్ఘ పయనం చేశాడు’ అని లాంగర్ తెలిపాడు.
వరల్డ్‌కప్‌కు మరికొన్న నెలల సమయం మాత‍్రమే ఉన్న తరుణంలో డేవిడ్ సాకర్ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను ఒక్కసారిగా డైలమాలో పడేసింది. అయితే గతంతలో ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న ట్రాయ్ కూలీని భారత్, పాకిస్తాన్‌లతో సిరీస్‌లకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ట్రాయ్ కూలీనే వరల్డ్‌కప్ వరకూ కోచ్‌గా బౌలింగ్ కొనసాగిస్తుందా..లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment