అజహర్‌ అలీ సెంచరీ | Azhar Ali Century | Sakshi
Sakshi News home page

అజహర్‌ అలీ సెంచరీ

Published Wed, Dec 28 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

అజహర్‌ అలీ సెంచరీ

అజహర్‌ అలీ సెంచరీ

పాకిస్తాన్‌ 310/6
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు  


మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్‌ పుంజుకుంది. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న అజహర్‌ అలీ (287 బంతుల్లో 139 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ 101.2 ఓవర్లలో 6 వికెట్లకు 310 పరుగులు చేసింది. తొలి రోజు ఆటలాగే మంగళవారం కూడా వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 50.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 142/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన పాక్‌ను త్వరగా అవుట్‌ చేయాలనుకున్న ఆసీస్‌ బౌలర్ల ఆశలను అలీ వమ్ము చేశాడు.

218 బంతుల్లో కెరీర్‌లో 12వ శతకం సాధించిన అలీ.. అసద్‌ షఫీక్‌ (123 బంతుల్లో 50; 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు. అలాగే ఈ ఏడాది పాక్‌ తరఫున అత్యధిక పరుగులు (1089) సాధించిన ఆటగాడయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అలీకి జతగా ఆమిర్‌ (23 బంతుల్లో 28 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) ఉన్నాడు. బర్డ్‌కు మూడు, హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement