అబుదాబి: పాకిస్తాన్ పేసర్ అబ్బాస్ (5/33) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆసీస్‌ను అతలాకుతలం చేశాడు. అతని ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 50.4 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్‌కు 137 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్బాస్ ధాటికి ఆసీస్ జట్టులో ఫించ్ (39; 5 ఫోర్లు), స్టార్క్ (34; 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు.
ఓవర్‌నైట్ స్కోరు 20/2తో బుధవారం ఆటకొనసాగించిన ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఫఖర్ (66; 7 ఫోర్లు), అజహర్ అలీ (54 బ్యాటింగ్; 3 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రస్తుతం
ఆసీస్‌కు అబ్బాస్ దెబ్బ
Published Thu, Oct 18 2018 12:54 AM | Last Updated on Thu, Oct 18 2018 12:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment