బాబర్‌ ఆజమ్‌ సెంచరీ | Babur Azam Century | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజమ్‌ సెంచరీ

Published Wed, Oct 18 2017 12:23 AM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

Babur Azam Century - Sakshi

అబుదాబి: బాబర్‌ ఆజమ్‌ (133 బంతుల్లో 101; 6 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీతో పాకిస్తాన్‌ను గెలిపించాడు. సోమవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో పాక్‌ 32 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.  ముందుగా పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఒక దశలో పాక్‌ 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా...ఆజమ్, షాదాబ్‌ ఖాన్‌ (52 నాటౌట్‌) కలిసి జట్టును ఆదుకున్నారు. అనంతరం శ్రీలంక 48 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ (144 బంతుల్లో 112; 14 ఫోర్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో లంకకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో వన్డే ఇన్నింగ్స్‌లో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన తొలి శ్రీలంక ఓపెనర్‌గా తరంగ గుర్తింపు పొందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement