
చైనా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో సింధు వరుస పరాజయం పాలైంది. మొదటి గేమ్‌లో కొంత పోరాటపటిమ చూపిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి గేమ్‌ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న మారిన్ రెండో గేమ్‌లో మరింత చెలరేగిపోయింది. మారిన్ దూకుడు ముందు సింధు తేలిపోయింది. ఎప్పటిలాగే గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ.. మైదానంలో చెలరేగిపోయిన మారిన్ రెండో గేమ్‌ను 21-10తేడాతో సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సింధు సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment