
బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధూ ఓటమిపాలైంది. ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో 12-21, 5-21తో ఓటమిపాలైంది. తొలి సెట్‌లో సింధూకు శుభారంభం లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై, ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలన్న ఆశలను అడియాశలు చేసుకుంది.
తొలుత కరోలినా కాస్త నెమ్మదిగా కదిలినప్పటికీ.. ఆతరువాత గేర్ మార్చి సింధుపై పూర్తి ఆధిక్యాన్ని సాధించి, రెండో గేమ్‌లో సింధూను కనీసం రెండంకెల స్కోర్ కూడా సాధించనీయకుండా చేసింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో మారిన్ వరుస పాయింట్లు సాధిస్తూ సింధూకు ఊపిరి సడలనివ్వకుండా చేసి, టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ ఓటమితో మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6–9తో వెనుకబడిపోయింది. వీరిద్దరూ తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో మారిన్‌దే పైచేయి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment