
ఫ్లోరిడా : వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 17.1 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 19 పరుగుల తేడాతో బంగ్లాదే విజయమని ప్రకటించారు.
దీంతో వరుసగా రెండు టీ20లను గెలుచుకున్న బంగ్లా.. సిరీస్ కైవసం చేసుకుంది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ వరించగా.. ఓపెనర్ లిటన్ దాస్(61:32బంతులు: 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన బంగ్లాదేశ్ వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment