‘ప్రపంచ దిగ్గజం ఎంఎస్7’
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచ దిగ్గజ ప్లేయర్ అని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ సబ్బిర్ రెహ్మన్ అభిప్రాయపడ్డాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ యంగ్‌స్టార్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన ప్రదర్శనతో బంగ్లాదేశ్ భవిష్యత్తు క్రికెట్‌లో ఈ 25 ఏళ్ల కుర్రాడు తనదైన ముద్రవేయనున్నాడు. ఇటీవల ధోనిని కలిసిన సబ్బిర్ అతనితో దిగిన ఫోటోను ఫేస్ బుక్‌లో షేర్ చేశాడు. ‘ప్రపంచ దిగ్గజం ఎంఎస్7’తో నేను అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ధోని జెర్సీ నెంబర్ 7 అని తెలిసిన విషయమే.
మొర్తజా భారత ఆటగాళ్లు మంచి సంబంధాలున్నాయని, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఓటమి అనంతరం ఇండియన్ ప్లేయర్స్‌తో చాటింగ్ కూడా చేశామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా టోర్నీ అనంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఆటలో స్లెడ్జింగ్‌కు పాల్పడిన అది మైదానానికే పరిమితమని మొర్తజా అప్పట్లో పేర్కొన్నాడు.