ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు కాల్వ భువన, నిధి చిలుముల వరుస విజయాలతో సత్తా చాటారు.
మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన రెండో రౌండ్లో భువన 6-4, 7-5తో మాన్య నాగ్‌పాల్‌పై చెమటోడ్చి నెగ్గగా, నిధి 6-0, 6-0తో తతాచార్‌పై అలవోక విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రార్థన తొంబరే 6-7 (4/7), 6-3, 6-0తో దామిని శర్మపై గెలుపొందగా, అమృత ముఖర్జీ 0-6, 6-4, 6-2తో శర్మదా బాలును కంగుతినిపించింది. నటాషా పల్హా 6-1, 6-4తో సంచన షరాన్ పాల్‌పై నెగ్గగా, ఇతీ మెహతా 6-0, 6-2తో రిషిక రవీంద్రన్‌పై సునాయాస విజయం సాధించింది. రిషిక సుంకర 6-0, 6-1తో రేష్మ గణపతిపై, శ్వేతా రాణా 6-2, 6-3తో ఆర్తి మునియన్‌పై గెలుపొందారు.
మూడో రౌండ్లో భువన, నిధి
Published Wed, May 7 2014 11:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement