అబ్బా ధోని.. ఏం ఫిట్‌నెస్‌ అయ్యా నీది! | BCCI Applauds MS Dhoni Acrobatic Move During 2nd T20I | Sakshi
Sakshi News home page

అబ్బా ధోని.. ఏం ఫిట్‌నెస్‌ అయ్యా నీది!

Published Fri, Mar 1 2019 8:32 AM | Last Updated on Fri, Mar 1 2019 8:41 AM

BCCI Applauds MS Dhoni Acrobatic Move During 2nd T20I - Sakshi

ఎంఎస్‌ ధోని

ముంబై : 37 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌ విషయంలో యువ ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోనని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి నిరూపించాడు. గత బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఓడి 0-2 తో సిరీస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అది కూడా ఎంస్‌ ధోనిది కావడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌ సంద్భంగా భారత ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్‌ ఆడం జంపా వేసిన 11వ ఓవర్‌లో ధోని ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయాడు. కానీ ధోని ముందుకుస్తున్నాడని పసిగట్టిన జంపా తెలివిగా బంతిని వేసాడు.

వెంటనే కీపర్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌ బంతిని అందుకొని వికెట్లను కొట్టేశాడు. కానీ అక్కడ ఉన్నది ధోని కదా.. పైగా ప్రపంచ అద్భుత కీపర్‌..  అలా ఉత్తగా ఎలా స్టంప్‌ ఔట్‌ అవుతాడు. ఏకంగా 2.4 మీటర్లు కాలు చాచి పిచ్‌లో పెట్టాడు. రివ్యూలో నాటౌట్‌గా తేలింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీసీసీఐ.. ‘ ధోని ఎలా చాచాడబ్బా!’ అంటూ ఫొటోతో సహా ట్వీట్‌ చేసింది. ‘అతని కాళ్లు ఎలాస్టిక్‌ ఏమో!.. ఏం ఫిట్‌నెస్‌ అయ్యా నీది’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ధోని దాటిగా ఆడి 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అంతేకాకుండా కెప్టెన్‌ కోహ్లితో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 191 భారీ లక్ష్యం విధించినప్పటికి మ్యాక్స్‌వెల్‌ శతకం ధాటికి ఆ స్కోర్‌ చిన్నబోయింది. ఫలితంగా భారత్‌ పరాజయం చవిచూసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement