బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరిచింది. గాయం నుంచి కోలుకున్న షమీ.. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వస్తాడని వార్తలు వినిపించాయి. అయితే షమీ మరోసారి గాయం బారిన పడ్డాడు.
బౌలింగ్ ఓవర్‌లోడ్ కారణంగా షమీ మోకాలి వాపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయడానికి సిద్ధంగా లేడని బీసీసీఐ వైద్య బృందం తెల్చింది. ఈ క్రమంలోనే షమీ టీమిండియా రీఎంట్రీ మరింత అలస్యం కానుంది.
"ఈ ఏడాది రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ తరుపున షమీ 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మొత్తం 9 మ్యాచ్‌ల్లో ఆడాడు. ఆ సమయంలో అతడు టెస్టు క్రికెట్‌లో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని భావించాము.
అందుకు తగ్గట్టు షమీ కూడా అదనపు బౌలింగ్ ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గోన్నాడు. కానీ బౌలింగ్ వర్క్‌లోడ్ ఎక్కువ కావడంతో అతడి ఎడమ మోకాలి వాపు వచ్చింది. ఈ క్రమంలో అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పరిశీలించింది.
అతడు ఇంకా ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ సాధించలేదని మా వైద్య బృందం నిర్ధారించింది. అతడు పూర్తి స్ధాయి క్రికెట్‌కు అందుబాటులోకి రావడం మరింత సమయం పట్టనుంది.
దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్ట్‌లకు షమీ దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పరిశీలను ఉంటాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను పాల్గొనడం కూడా అనుమానమే" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment