
ఆయన నాయకత్వంలో టీమిండియా చాలా సేఫ్...
కోల్కతా : భారత క్రికెట్ బోర్డులోకి జగ్ మోహన్ దాల్మియా తిరిగి రావడంతో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు బీసీసీఐ సురక్షితులైన వ్యక్తి చేతుల్లో ఉందంటూ శుక్రవారం గంగూలీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణాలు, భారత ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇందులో భాగస్వాములవ్వడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని వివాదాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తర్వాత దాల్మియా చాలా నాటకీయ పరిణామాల మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యారు.
'మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. బీసీసీఐ అధ్యక్షుడిగా లేకపోయినా మీరంటే మాకు గౌరవం, ప్రేమ ఉన్నాయి. భారత క్రికెట్ ను ఆయన మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ రాకతో టీమిండియా చాలా సేఫ్ గా ఉంటుంది' అని లెఫ్ట్ హ్యాండర్, మాజీ కెప్టెన్ గంగూలీ వ్యాఖ్యానించాడు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన దాల్మియా క్రికెట్ బోర్డును లభాల బాటలో నడిపించిన విషయం అందరికి తెలిసందే.