న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నివేదిక సమర్పించింది. భారత క్రికెట్ బోర్డులో ఉంటూ ఐపీఎల్లో లాభదాయక పదవుల్లో ఉంటున్న వారి జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించింది.
బీసీసీఐ అందజేసిన జాబితాలో మాజీ క్రికెటర్లు గవాస్కర్, గంగూలీ, శ్రీకాంత్, రవిశాస్త్రి పేర్లు ఉన్నాయి. వీరందరూ ఐపీఎల్లో కామెంటేటర్లుగా పనిచేస్తున్నారు. సుప్రీం కోర్టు ఐపీఎల్ కేసును బుధవారం విచారించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్కు యజమానిగా ఉండటంపైనా కోర్టు ప్రశ్నించింది. అలాగే బీసీసీఐ పరిధిలో ఉంటూ వ్యక్తిగత లాభం కోసం ఐపీఎల్లో పనిచేయడాన్ని ప్రశ్నించింది.
సుప్రీం కోర్టుకు బీసీసీఐ నివేదిక
Published Wed, Dec 17 2014 3:13 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement