
వడోదర: లీగ్ దశతోపాటు సూపర్ లీగ్ దశలోనూ అజేయంగా నిలిచిన రైల్వేస్ జట్టు బీసీసీఐ మహిళల సీనియర్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎలైట్ సూపర్ లీగ్‌లో నాలుగు జట్లు పోటీపడగా... హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ కెప్టెన్సీలో రైల్వేస్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 11వసారి ఈ టైటిల్‌ను దక్కించుకుంది.
సోమవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో రైల్వేస్ ఐదు వికెట్లతో ఢిల్లీని ఓడించింది. తొలుత ఢిల్లీ ఆరు వికెట్లకు 166 పరుగులు సాధించింది. 167 పరుగుల లక్ష్యాన్ని రైల్వేస్ జట్టు 46.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మిథాలీ రాజ్ (49 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment