తొలి రెండు వికెట్లు భువీకే.. | Bhuvneshwar Kumar gets first two wickets in bangladesh match | Sakshi
Sakshi News home page

తొలి రెండు వికెట్లు భువీకే..

Published Thu, Jun 15 2017 4:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

తొలి రెండు వికెట్లు భువీకే..

తొలి రెండు వికెట్లు భువీకే..

బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించి తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ ను డకౌట్ గా పంపి శుభారంభాన్ని అందించిన భువీ..ఆపై కాసేపటికి దూకుడుగా ఆడుతున్న షబ్బిర్ రెహ్మాన్(19)ను సైతం అవుట్ చేసి సత్తా చాటాడు.

 

దాంతో బంగ్లాదేశ్ 31 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది. తొలి స్పెల్ లో ఆరు ఓవర్లు వేసిన భువనేశ్వర్ రెండు వికెట్లు తీయడమే కాకుండా ఒక మెయిడిన్ ఓవర్ సాయంతో 30 పరుగులిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement