భారత్-లంక రెండో వన్డే; మరో విశేషం
పల్లెకెలె: శ్రీలంకతో గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్యాట్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను సమయోచిత బ్యాటింగ్‌తో గెలుపు బాట పట్టించాడు. 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోనితో కలిసి 100 పరుగులు అభేద్య భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం(100) నెలకొల్పిన జోడిగా ధోని-భువి రికార్డు సృష్టించారు.
వన్డేల్లో తొలి అర్థసెంచరీని మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్నాడు. భువనేశ్వర్ 80 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 53 చేశాడు. ధోని 68 బంతుల్లో కేవల ఒక ఫోర్‌తో 45 పరుగులు సాధించాడు. భువీ ఇన్నింగ్స్‌లో మరో విశేషం కూడా ఉంది. ముందుగా 10 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చిన భువీ, బ్యాటింగ్‌లో కరెక్టుగా అన్నే పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయిన భువీ.. బ్యాట్‌తో దుమ్మురేపాడు.