‘డ్రా’లను కూడా ఫిక్స్ చేశారు | Blatter claims European draws were rigged | Sakshi
Sakshi News home page

‘డ్రా’లను కూడా ఫిక్స్ చేశారు

Published Wed, Jun 15 2016 12:55 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

‘డ్రా’లను కూడా ఫిక్స్ చేశారు - Sakshi

‘డ్రా’లను కూడా ఫిక్స్ చేశారు

యూరోపియన్ టోర్నీలపై బ్లాటర్
జ్యూరిచ్: కొన్ని యూరోపియన్ టోర్నీల ‘డ్రా’లను కూడా తమకు అనుకూలంగా ఫిక్స్ చేసుకున్నారని ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ సంచలన ఆరోపణలు చేశారు. దీని కోసం చల్లని, వేడి బంతులను ఉపయోగించారని తెలిపారు. ‘డ్రా’కు ముందు చిన్న ఫుట్‌బాల్స్‌పై ఆయా జట్ల పేర్లను రాస్తారు. తమకు కావాల్సిన జట్టు బంతిని ముందే ఫ్రిజ్‌లో ఉంచి అనుకూలమైన ‘డ్రా’లో వేస్తారని చెప్పారు. అయితే తన హయాంలో మాత్రం ఇలా ఒక్క డ్రా కూడా ఫిక్స్ కాలేదని స్పష్టం చేవారు. మరోవైపు తన అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను స్విస్, యూఎస్ పరిశోధకులు ఇప్పటిదాకా సేకరించలేకపోయారని బ్లాటర్ తెలిపారు. తనపై జరిగిందంతా ఓ కుట్రగా ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement